84 మంది కల్యాణలక్షి, షాదీ ముబారక్ లబ్ది దారులకు దాదాపు 85 లక్షల విలువగల చెక్కులు అందజేశారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో లబ్ధిదారులతో మాట్లాడుతూ… అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలులో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తూ ప్రజలకు ఆదర్శ పాలనను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో 84 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేద ఆడపడుచుల పెండ్లికి ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం ఒక్క తెలంగాణ లో తప్ప దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్ లు, రైతులకు పంట పెట్టుబడుల కోసం ఆర్ధిక సహాయం వంటి అనేక కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన వారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.
