‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం మార్మోగింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ అంతటా భారత జాతీయ గీతాలాపన కార్యక్రమం జరిగింది. సరిగ్గా 11.30 గంటలకు నిమిషం పాటు ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యా సంస్థలు, ప్రైవేటు సంస్థల వద్ద సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించారు. మెట్రో రైలు సహా ఆర్‌టిసి బస్సులు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేసి గీతాలాపన చేశారు. కాగా, హైదరాబాద్‌లోని అబిడ్స్ జీపీఎస్ సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సీఎం కేసీఆర్, వివిధ శాఖల మంత్రులు హాజరై జనగణమన ఆలపించారు. రాష్ట్రంలోని అన్ని కూడళ్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, విద్యార్థులు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరై జాతీయ గీతాన్ని ఆలపించారు.