mt_logo

కుళాయి నీటి సరఫరాలో తెలంగాణ దేశంలో మొదటిస్థానం

తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. వంద శాతం కుళాయి నీటి సరఫరా చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో చేరింది. సోమవారం పార్లమెంటులో సమర్పించిన ఆర్థిక సర్వే 2021-22 నివేదిక ప్రకారం, జనవరి 2 నాటికి భారతదేశంలోని దాదాపు 5.51 కోట్ల కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ కింద కుళాయి నీటి సరఫరా అందించబడిన ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో హర్యానాతో పాటు తెలంగాణ మాత్రమే మొదటి స్థానాన్ని పొందింది. మిగిలిన వాటిలో గోవా, అండమాన్ మరియు నికోబార్ దీవులు, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ మరియు హర్యానా ఉన్నాయి. నీతి ఆయోగ్ SDG ఇండియా ఇండెక్స్ మరియు డ్యాష్‌బోర్డ్ 2020-21 ప్రకారం 69 పాయింట్ల స్కోర్‌తో సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDG) సాధించడంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. జాతీయ సగటు 66 పాయింట్లు ఉండగా తెలంగాణ క్లీన్ ఎనర్జీలో 100 పాయింట్లతో పాటు క్లీన్ వాటర్ మరియు శానిటేషన్‌లో 96 పాయింట్లతో ఇతర రాష్ట్రాలలో మెరుగైన పనితీరు కనబరిచింది. ఇదిలా ఉండగా, 2021-22 బడ్జెట్ సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ పథకం కింద కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి కేవలం 2,324.42 కోట్ల అరకొర నిధులు మాత్రమే అందించింది. ఇది మిషన్ భగీరథ కార్యక్రమం కింద మొత్తం వ్యయం 45,000 కోట్లలో ఆరు శాతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *