రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేటీఆర్ వివరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బీమా సంస్థ స్విస్ రే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులు కేటీఆర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. స్విస్ రే కంపెనీకి ఘన స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. ఈ ఆగస్టులో హైదరాబాద్‌లో స్విస్ రే కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించనుందని చెప్పారు. హైదరాబాద్‌లో ఈ కంపెనీ 250 మందితో ప్రారంభం కానుందది. డాటా, డిజిటల్ కెపబిలిటీస్, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ పై దృష్టి సారించనుంది. ఈ సందర్భంగా స్విస్ రే కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ కేంద్రంగా.. ప్రపంచంలోని 80 ప్రాంతాల్లో స్విస్ రే కంపెనీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

