కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు భక్తులు లేకుండా ఆలయ అర్చకుల సమక్షంలోనే జరిగిన భద్రాచలం సీతారాముల కళ్యాణం.. నేడు భక్తుల నడుమా అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సముహూర్తంలో నిర్వహించిన సీతారాముల కల్యాణం వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు వంటి పలు రాష్ట్రాల నుంచి దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు హాజరయ్యారు. కాగా స్వామి వారి కల్యాణానికి ప్రభుత్వం తరుపున సంప్రదాయబద్ధంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, జిల్లా ఇంఛార్జి, రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముత్యాల తలంబ్రాల సమర్పించారు. వారితో పాటు రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు వడదెబ్బ తగలకుండా.. తాగు నీటితో పాటు మజ్జిగ ఎర్పాటు చేశారు. భక్తజనులకు తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచారు.

