mt_logo

శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని తెలియజేశారు. ‘ధర్మో రక్షతి రక్షితః’ అంటూ… సామాజిక విలువను తుచ తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు సీతారామ చంద్రుడు భారతీయుల ఇష్ట దైవమని సీఎం కేసిఆర్ కీర్తించారు. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాల కోర్చిన సీతారాముల పవిత్ర భార్యా భర్తలబంధం అజరామరమైనదని, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని అన్నారు. భద్రాచల సీతారాముల వారి ఆశీస్సులు సదా రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని శ్రీ సీతారాములను సీఎం కేసీఆర్ ప్రార్ధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *