ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పు మీద తప్పుపై ఫస్ట్‌పోస్టు అనే ఓ ప్రైవేటు వెబ్‌సైట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు అడ్డంగా దొరికినప్పటి నుంచి ఇప్పటి వరకు బాబు చేస్తున్న తప్పులపై ఓ కథనం ప్రచురితమైంది. టీ న్యూస్‌కు అర్థరాత్రి నోటీసులు ఇవ్వడం బాబు చేసిన అతి పెద్ద తప్పని ఫస్ట్‌పోస్టు వర్ణించింది. బాబు తప్పించుకోలేని విధంగా బుక్కయ్యాడని చెప్పడానికి 10 కారణాలతో ఫస్ట్‌పోస్టు ప్రత్యేక కథనం ప్రచురించింది.
కారణం 1 : రేవంత్‌రెడ్డి అరెస్టు కేసీఆర్ కుట్ర అంటూ ఆరోపణలు..
కారణం 2 : వీడియో పుటేజ్ బయటపడ్డ తర్వాత టీడీపీ నాలిక కరుచుకోవడం.
కారణం 3 : ఈ వ్యవహారంలో సంబంధం లేదంటూనే రేవంత్ రెడ్డి వీడియో టేప్ మీడియాలో ప్రసారమైన తర్వాత ఏపీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ పరస్పర విరుద్ధంగా మూడు రకాల ప్రకటనలు చేయడం.
కారణం 4 : చంద్రబాబు కూడా ఓ వైపు కట్‌పేస్ట్ అంటూ మరోవైపు ట్యాపింగ్ అంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం.. ఇంతకూ మాట్లాడింది తాను కాదని ఎక్కడా చెప్పకపోవడం.
కారణం 5 : ఓటుకు నోటు కేసులో నిందితుడు, తప్పించుకు తిరుగుతున్న జెరూసలేం మత్తయ్యతో ఫిర్యాదు చేయించి దాని ఆధారంగా సిట్‌ను ఏర్పాటు చేయడం.
కారణం 6 : జాతీయ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టీఫెన్‌సన్ సంభాషణ తనదో కాదో చెప్పకుండా విషయాన్ని పక్కదారి పట్టించి అడ్డంగా దొరికిపోవడం.
కారణం 7 : ఓటుకు నోటు కుంభకోణంలో ఏ మాత్రం సంబంధం లేని సెక్షన్ 8ను తెరపైకి తీసుకురావడం.
కారణం 8 : గవర్నర్ నరసింహన్‌పై టీడీపీ మంత్రులు ఆధారం లేని ఆరోపణలు.. గంగిరెద్దు అంటూ తిట్ల దండకం.. ఆపై చేసిన తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గడం.
కారణం 9 : హైదరాబాద్ కామన్ క్యాపిటల్.. హైదరాబాద్‌లో సొంత పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ప్రకటన వంటి రాజ్యాంగపరమైన తప్పిదాలు.
కారణం 10 : కేబుల్ టీవీ నెట్‌వర్క్ రెగ్యులేషన్ చట్టం కింద శుక్రవారం అర్ధరాత్రి టీ న్యూస్‌కు విశాఖ పోలీసుల చేత నోటీసులిప్పించడం.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..