టీయూడబ్ల్యూజే నేతలు ఈరోజు మధ్యాహ్నం ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ను కలిసి తమ సమస్యలను వివరించగా సమస్యల పరిష్కారంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆర్ధిక, సమాచార, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై కేటీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నెలాఖరులోగా జర్నలిస్టులకు అక్రిడేషన్లు, త్వరలోనే హెల్త్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఈ మధ్యనే మరణించిన జర్నలిస్టులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రమాద భీమా మొత్తాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.