mt_logo

పొన్నాల దమ్ములేని దద్దమ్మ- ఈటెల రాజేందర్

ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా ఇప్పుడు తెలంగాణ గురించి, అమరుల గురించి పొన్నాల లక్ష్మయ్య  మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. ఆంధ్రా వాళ్ళ పంచన చేరి వాళ్ళ మోకాళ్ళ దగ్గర మోకరిల్లండని, అవాకులు, చెవాకులు మానాలని ఈటెల పొన్నాలను హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తెలంగాణ జాతికి వారు చేసిన అన్యాయాలను అడిగే దమ్ములేని దద్దమ్మ పొన్నాల అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ హయాంలో జరిగిన నీటివనరుల దోపిడీలో పొన్నాల హస్తముందని, సీమాంధ్రకు తెలంగాణ సంపద తరలిపోతున్నప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి సంతకాలు పెట్టింది పొన్నాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ కుట్రలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు రాకుండా కుట్ర చేసింది పొన్నాల కాదా? అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *