mt_logo

ఆగస్టు 4న ప్రారంభం కానున్న పోలీస్ టవర్స్

తెలంగాణ ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ అండ్ కంట్రో సెంట‌ర్‌ (పోలీస్ టవర్స్ )ను ఆగ‌స్టు 4వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. బంజారా హిల్స్‌లో రాష్ట్రంలోనే అతిపెద్ద క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ను నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుతో అనుబంధం ఉన్న అన్ని శాఖ‌ల‌కు సిటీ పోలీసు క‌మీష‌న‌ర్ సీవీ ఆనంద్‌ ఓ మెమోను రిలీజ్ చేశారు. ప్రారంభోత్స‌వానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని లాజిస్టిక్స్‌, ప్లానింగ్‌, ఎగ్జిక్యూష‌న్‌కు సంబంధించిన పెండింగ్ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని కోరారు. క‌మాండ్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వాన్ని గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని, దీని ద్వారా హైద‌రాబాద్ సిటీ పోలీస్ ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింప చేయాల‌ని ఆయ‌న త‌న మెమోలో తెలిపారు.,పోలీసు శాఖ‌లో ఉన్న వివిధ ర‌కాల యూనిట్లు అన్నీ ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో ఒకే వేదిక‌గా ప‌ని చేయ‌నున్నాయి. అయితే రాష్ట్ర‌వ్యాప్తంగా ఇన్‌స్టాల్ చేసిన సుమారు 9.25 ల‌క్ష‌ల కెమెరాల‌ను ఈ సెంట‌ర్‌లో మానిట‌ర్ చేయ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *