mt_logo

సిరిసిల్లలో సిద్దమవుతున్న కోటి జాతీయ జెండాలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగురవేయనున్న కోటి జాతీయ జెండాలను సిరిసిల్లలోని నేత కార్మికుల ఆధ్వర్యంలో తయారవుతున్నాయి. రూ.23 కోట్ల వ్యయంతో 60 లక్షల మీటర్ల స్వచ్ఛమైన పాలిస్టర్‌ వస్త్రంతో వీటిని రూపొందిస్తున్నారు. వస్త్రం తయారీ, రంగుల అద్దకం, జెండాలు కుట్టడం తదితర పనులన్నీ నేత కార్మికులే చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 50 లక్షల జెండాలను సిరిసిల్లలో, మిగిలిన 50 లక్షల జెండాలను హైదరాబాద్‌లో కుట్టిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఈ నెల ఐదు నుంచి పదో తేదీలోగా జెండాలు జిల్లాలకు రవాణా చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. ప్రతి కుటుంబానికి ఒకటి చొప్పున ఉచితంగా జెండాలు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. జెండాలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోకుండా ఇక్కడే తయారు చేసుకోవడం వల్ల నేత కార్మికులకు ఉపాధి కలుగుతున్నదని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *