mt_logo

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు – నేడు ఇంటింటికీ జాతీయ పతాకం పంపిణీ

భారతదేశం స్వాతంత్రం పొంది 75 ఏండ్లు అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌ లో సీఎం కేసీఆర్‌ సోమవారం అధికారికంగా ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. కాగా ఈ వేడుకల్లో భాగంగా ఇంటింటికీ జాతీయ పతాకం పంపిణీతో జిల్లాల్లో మంగళవారం నుంచి మొదలవుతున్నాయి. ప్రతి పల్లె, బస్తీల్లోనూ ప్రతి ఇంటికీ జాతీయ పతాకం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరే షన్ల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ జాతీయ జెండాను అందించనున్నారు. ఈ నెల 22 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఆగస్టు 8 నుంచి 22 వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా మంత్రులు, స్థానిక సంస్థల ప్రజాప్రతి నిధులు, జిల్లా కలెక్టర్లు, ముఖ్య అధికారులు నేతృత్వం లోని కమిటీలు చర్యలు తీసుకున్నాయి. ఈ ఉత్సవాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు అందుబాటులో ఉండేలా జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *