రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు ఉస్మానియా దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా ఆస్పత్రి స్థానంలో కొత్త ఆసుపత్రిని నిర్మిస్తామంటే వేరే పార్టీలవారు ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదని, ఇప్పటికైనా ఇతర పార్టీల నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు.
అభివృద్ధికి సహకరించకపోయినా ఫర్వాలేదు కానీ, అడ్డుపడకండి.. మీకు ప్రజల ప్రాణాలు, సిబ్బంది ప్రాణాలు ముఖ్యం కాదా అని ప్రశ్నించారు. గతంలో మీరు చేయలేని పనిని మా ప్రభుత్వం చేస్తుంది. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యమని తలసాని స్పష్టం చేశారు.