mt_logo

వారంలోగా పోటీ పరీక్షల సిలబస్- టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. విద్యావ్యవస్థను చక్కదిద్దేందుకు విద్యాశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఘంటా చక్రపాణిని కూడా సీఎం ఆహ్వానించారు. సుమారు రెండు గంటలపాటు ముఖ్యమంత్రి టీఎస్‌పీఎస్‌సీ పై చర్చించారు. కమిషన్ లో పనిచేస్తున్న 50 మంది తాత్కాలిక ఉద్యోగుల జీతాల ఫైలు పెండింగ్ లో ఉన్న విషయం సీఎం దృష్టికి తీసుకురాగానే ముఖ్యమంత్రి జీతాల విడుదల ఫైలుపై వెంటనే సంతకం చేశారు.

కమిషన్ ఉద్యోగుల సంఖ్య పెంపుదల, మరిన్ని ఖాళీల భర్తీకి సంబంధించి సీఎం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎంతో భేటీ అనంతరం కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ వారంలోగా పోటీ పరీక్షల సిలబస్ ను ప్రకటిస్తామని, దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా పోటీ పరీక్షలు ఉంటాయని, ఈ విషయంలో నిరుద్యోగులు ఎలాంటి అపోహలు, గందరగోళానికి గురి కావద్దని సూచించారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఘంటా చక్రపాణి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *