mt_logo

పల్లెపల్లెనా రైతుబంధు వారోత్సవాలు.. ఆలేరులో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన రైతుబంధు వారోత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పంటపెట్టుబడి ఇస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని, ఈ గొప్ప ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చిన రైతుబాంధవుడు సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. గత ఎనిమిది విడతలుగా రైతుబంధు ద్వారా రైతుల ఖాతాల్లో 50 వేల కోట్లు జమ చేయడం తెలంగాణ ప్రభుత్వం యొక్క అపూర్వ విజయం అని పేర్కొన్నారు. యూఎన్ఓ, గొప్ప ఆర్థిక వేత్తలు, వ్యవసాయ నిపుణులు రైతుబంధు ఒక గేమ్ చేంజర్ అని అభినందించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఅర్ రైతుల కోసమే నిరంతరం తపిస్తారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలో ప్రకటించిన విధంగా కోటి ఎకరాలకు సాగునీరు మాటకు కట్టుబడి పనిచేస్తున్నారన్నారు. తెలంగాణలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇన్ని పథకాలు ప్రవేశపెట్టారని తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల పరిస్థితి దైన్యంగా ఉండేదని, ఇపుడు అదే రైతుల ముఖంలో చిరునవ్వులు విరుస్తున్నాయన్నారు. రైతులు పల్లెపల్లెనా రైతుబంధు వారోత్సవాలు జరుపుకుంటూ స్వచ్చందంగా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారని స్పష్టం చేసారు. పత్తి పంట విరివిగా పండించాలని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి రైతులను కోరారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని.. డిమాండ్ కు తగ్గట్టు పత్తి పండించాలన్నారు. ఈ ఏడాది పత్తి అధిక ధర పలుకుతోందని, పత్తి పండించిన రైతులు నేడు ఎంతో లాభపడుతున్నారని అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా చిన్నారులు వ్యవసాయం నాడు-నేడు అనే అంశం మీద గీసిన చిత్రాలు పలువురిని ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే గొంగడి సునీతా మహేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *