mt_logo

కేంద్రం దేశ జవాన్లతో చెలగాటం ఆడుతోంది : మంత్రి కేటీఆర్

కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంద‌ని, అగ్నివీర్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు ఆ తీవ్ర‌త‌ను సూచిస్తున్నాయ‌ని మంత్రి కేటీఆర్ త‌న సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. తొలుత దేశ రైతుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం ఆడుకుంద‌ని, ఇప్పుడు దేశ జ‌వాన్ల‌తోనూ ఆడుకుంటోంద‌ని కేటీఆర్ ఆరోపించారు. వ‌న్ ర్యాంక్ వ‌న్ పెన్ష‌న్ విధానం నుంచి ఇప్పుడు దేశంలో నో ర్యాంక్ నో పెన్ష‌న్ గా మారింద‌ని కేంద్ర వైఖ‌రిని విమ‌ర్శించారు. అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత, ఆర్మీ అభ్యర్థులు, నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. కాగా ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఆర్మీ అభ్య‌ర్థులు ఫ‌ర్నీచ‌ర్‌, రైళ్ల‌ను ధ్వంసం చేయగా… ఆర్మీ అభ్య‌ర్థుల్ని చెద‌ర‌గొట్టేందుకు కాల్పులు జ‌రిగాయి రైల్వే బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో వరంగల్ కు చెందిన ఓ యువకుడు మృతి చెందగా… పదిమంది దాకా తీవ్రంగా గాయపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *