mt_logo

మతోన్మాదులకు గట్టి కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్

హిందూ అయినా ముస్లిం అయినా రక్తం ఎరుపు రంగులోనే ఉంటుందని, బీజేపీ ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవాలని ఆరాటపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ… టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే కులమతాలకు అతీతంగా పనిచేస్తోందని, కానీ కొందరు మతాల మధ్య చిచ్చు పెడుతూ… ప్రజల మనస్సులో విషం నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ‘తెలంగాణకు కేంద్రం ఏం చేశారో చెప్పే దమ్ముందా.. నేను సవాల్ చేస్తున్నా’ ఇలా అడిగితే ఇష్ట మొచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతున్నారని తెలిపారు. పక్కనే కర్ణాటకకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చిన మోదీ.. తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరుకు అడిగితే ఇవ్వలేదు. గిరిజన రిజర్వేషన్లు పెంచమంటే నాలుగేళ్లయినా దున్నపోతు మీద వాన పడ్డ చందంగా చలనమే లేకుండా ఉన్నారన్నారు. ఏం అడిగినా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతానికి మాత్రమే మోదీ ప్రధాని అనుకుంటా’’ అంటూ మంత్రి కేటీఆర్‌ దుయ్యబట్టారు. “ఇటీవలి బడ్జెట్ లో గిరిజనులకు, రైతులకు, దళితులకు కేటాయింపులు లేవు. దేశం కోసం ధర్మం కోసం అంటారు తప్ప దేశానికి ఏం చేస్తారో చెప్పరు. ఎల్‌ఐసీకి రైతు బీమా అవకాశం మనం ఇస్తే.. మోదీ మాత్రం ప్రైవేట్ పరం చెయ్యాలని చూస్తున్నారు. మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ, ఆంధ్రను కలుపుతారంటూ’’ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *