mt_logo

గ్రీనరీలో తెలంగాణ టాప్ లో ఉంది : ప్రపంచ పర్యావరణవేత్త ఏరిక్ సోలీహిమ్

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గ్రీన‌రీలో టాప్‌లో నిలిచిందని ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త ఏరిక్ సోలీహిమ్ కొనియాడారు. మేడ్చ‌ల్ జిల్లాలోని ఓ అర్బ‌న్ ఫారెస్టు పార్కు ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడిపోతోంద‌ని ఏరిక్ సోలీహిమ్ ప్ర‌శంస‌లు కురిపిస్తూ పార్కుకు సంబంధించిన వీడియోను ఆయ‌న ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరం వరల్డ్ ట్రీ సిటీగా నిలవడం అద్భుతమని సోలిహిమ్ పేర్కొన్నారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రం ప‌చ్చ‌ద‌నంతో తెలంగాణ క‌ళ‌క‌ళ‌లాడిపోతోంది. ప‌ల్లెప్ర‌గ‌తిలో భాగంగా ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు గ్రామాల‌కు కొత్త‌రూపును తీసుకొచ్చాయి. ప‌ట్ట‌ణాల్లో ఏర్పాటు చేసిన అర్బ‌న్ ఫారెస్టు పార్కులు న‌గ‌ర వాసుల‌కు మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ క్ర‌మంలో హైదరాబాద్ నగరానికి 25 కిమీల దూరంలో ఏర్పాటు చేసిన మేడ్చ‌ల్ జిల్లాలోని అర్బ‌న్ ఫారెస్టు పార్కు ఆయుష్ వ‌నం… ప‌క్షుల కిల‌కిల రావాలు ప్ర‌కృతి ప్రేమికుల‌ను ఆక‌ట్టుకుంటాయి. చిక్కటి అడవిని తలపించే ఈ పార్కులో ప‌ర్యాట‌కులు సేద తీరేందుకు అద్భుత‌మైన షెడ్ల‌ను కూడా నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *