mt_logo

ప్రధానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఎద్దేవా చేసిన మంత్రి కేటీఆర్

మోదీ కోవిద్ వాక్సిన్ కనుగొన్నారని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అజ్ఞానాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. మోదీ జీకి మెడిసిన్‌ లేదా సైన్స్‌లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని కేటీఆర్ వ్యంగ్యంగా పోస్టు చేశారు. మోదీ కొవిడ్ వ్యాక్సిన్‌ను కనుగొన్నాడని మోదీ కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. మోదీ కేబినెట్ మిత్రులందరూ చాలా తెలివిమంతులని.. ఇది అంగీకరించాల్సిన విషయమని, ముఖ్యంగా కిషన్ రెడ్డి తెలివిమంతుడు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రధాని నోబెల్ బహుమతికి అర్హులే.. మరి ఏ కేటగిరిలో అని వ్యంగ్యం చేశారు. కొవిడ్ వ్యాక్సిన్‌ కనుగొన్నందుకు మెడిసిన్‌ విభాగంలో ఇవ్వాలా..? నోట్ల రద్దు, స్విస్ బ్యాంకుల్లో నల్లధనం తీసుకొచ్చినందుకు ఆర్థిక శాస్త్రంలో ఇవ్వాలా..? రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆరు గంటలు ఆపినందుకు శాంతి విభాగంలో ఇవ్వాలా..? రాడార్ థియరీకి గానూ ఫిజిక్స్‌లో ఇవ్వాలా? అని కేటీఆర్ అడిగారు. కొవిడ్ వ్యాక్సిన్‌ను మన దేశంలో మోదీనే కనుగొన్నాడని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన వీడియోను కూడా మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *