mt_logo

హైదరాబాద్ అభివృద్ధిలో హెచ్​ఎండిఏ పాత్ర కీలకం : మంత్రి కేటీఆర్

ఏడు జిల్లాల పరిధికి విస్తరించి ఉన్న హైదరాబాద్ మహా నగర అభివృద్ధిలో​ హెచ్​ఎండిఏ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని, ఇకపై దూరదృష్టితో కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకుసాగాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హెచ్​ఎండిఏ ఉన్నతాధికారులకు సూచించారు.​ శుక్రవారం తొలిసారిగా అమీర్​ పేట్​ లోని హెచ్​ఎండిఏ కార్యాలయానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రోపాలిటన్​ కమిషనర్​, స్పెషల్​ చీఫ్​ సెక్రెటరీ అర్వింద్​ కుమార్​ హెచ్​ఎండిఏ కార్యాచరణను మంత్రికి వివరించారు. అనంతరం ఇంజనీరింగ్​, ప్లానింగ్​, అర్బన్​ ఫారెస్ట్రీ వంటి విభాగాల వారీగా మంత్రి కేటీఆర్​ సమీక్షించి పూర్వోపరాలను అడిగి తెలుసుకొని,​ సంబంధిత అధికారులకు మంత్రి కేటీఆర్ కొన్ని సూచనలు చేశారు. మంత్రి సమీక్ష సమావేశానికి హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్​(హెచ్​జిసిఎల్​) ఎండి సంతోష్, అర్బన్​ ఫారెస్ట్రీ డైరెక్టర్​ బి. ప్రభాకర్​, హెచ్​ఎండిఏ సెక్రెటరీ పి.చంద్రయ్య, చీఫ్​ ఇంజీనీర్​ బి.ఎల్​.ఎన్​.రెడ్డి, ప్లానింగ్​ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *