అపుడు తెలంగాణను వెక్కిరించిన వాళ్లే నేడు తెలంగాణ అభివృద్ధిని చూసి మెచ్చుకుంటున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పేర్కొన్నారు. 2001లో కరీనంగర్ లో జరిగిన సింహగర్జన సభలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని తెరాస పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటనపై రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశారని.. కానీ, నేడు సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శుక్రవారం జనగాం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘మోడీ జాగ్రత్త.. ఢీల్లీ కోట గోడలు బద్ధలు కొడుతాం’ అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈ విధంగా స్పందించారు. ‘మొదట వాళ్లు నిన్ను పట్టించుకోరు. తర్వాత వాళ్లు నిన్ను చూసి నవ్వుతారు. ఆ తర్వాత వాళ్లు నీతో గొడవ పడుతారు. చివరకు విజయం నీదే’ అన్న జాతీపిత మహాత్మ గాంధీ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.
- BRS submits recommendations to 16th Finance Commission, seeks greater fiscal autonomy for Telangana
- HYDRAA Fear: Revenue of stamps and registrations department falls by 31% in August
- Despite heavy rains, 35% of tanks in Telangana remain empty
- Will Congress govt. proceed with local body polls without 42% BC reservation?
- Is Revanth using HYDRAA to threaten ministers? Issue reaches Congress high command
- ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవా?: కేటీఆర్ ధ్వజం
- రేవంత్‌కు బ్యాడ్ టైమ్ స్టార్టయ్యిందా?
- తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను అక్రమ కేసులతో వేధిస్తున్న కాంగ్రెస్!
- ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ విజయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చింది: కేటీఆర్
- ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కి చెంపపెట్టు: హరీష్ రావు
- కాళోజీ కలం.. సామాన్యుల గళం.. ప్రజలకు బలం: కేటీఆర్
- తెలంగాణ ఉద్యమంలో ప్రజాకవి కాళోజీ స్ఫూర్తి ఇమిడివుంది: కేసీఆర్
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- రైతులు ఆత్మహత్యలు చేసుకోవొద్దు.. కలిసి పోరాడుదాం: హరీష్ రావు పిలుపు