mt_logo

ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు : సీఎం కేసీఆర్

దళితులు పేదరికం నుండి బయట పడుతుంటే ప్రతిపక్షాల కళ్ళు మండుతున్నాయని, ఎవరు ఏం చేసినా దళిత బంధు ఆపేది లేదని, ఈ ఏడాది 40 వేల కుటుంబాల‌కు ద‌ళిత బంధు కింద 10 ల‌క్ష‌లు అంద‌జేయ‌నున్నామ‌ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జనగామలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… సంవ‌త్స‌రానికి రెండు, మూడు ల‌క్ష‌ల కుటుంబాల‌కు రైతు బంధును అంద‌జేస్తామ‌ని, వాళ్ల‌ను ఆర్థికంగా పైకి తీసుకువ‌స్తామ‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘‘ద‌ళితుల పేద‌రికం పోవాలి. బ‌య‌ట చాలామంది క‌ళ్లు మండుతున్నాయి. ఈ మార్చి త‌ర్వాత ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 2 వేల కుటుంబాల‌కు ద‌ళిత బంధు వ‌స్తుంది. ద‌ళిత బంధు ద్వారా 10 ల‌క్ష‌లు ఇవ్వ‌డ‌మే కాదు… మెడిక‌ల్ షాపుల ఓన‌ర్ల‌కు రిజ‌ర్వేష‌న్లు పెట్టాం. ఫ‌ర్టిలైజ‌ర్ షాపుల‌కు, ఆసుప‌త్రుల‌కు, ప్ర‌భుత్వ కాంట్రాక్టుల్లో, బార్ షాపుల‌లో కూడా రిజ‌ర్వేష‌న్లు పెట్టాం. ఇదివ‌ర‌కు బార్ షాపులు నిర్వ‌హించే ద‌ళితులు లేరు. కానీ..ఈరోజు ద‌ళితులు కూడా బార్ షాపులు నిర్వ‌హిస్తున్నారు. స‌మైక్య పాల‌కుల వ‌ల్ల న‌ష్ట‌పోయిన తెలంగాణ ఇప్పుడిప్పుడే బాగుప‌డుతోంది. గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు బీమా కింద 5 ల‌క్ష‌లు అంద‌జేస్తున్నాం. మంచి పంట భూములకు కనీస ధర కూడా లేకుండే, ఇపుడు ఎకరానికి కోట్లు పలుకుతోంది” అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *