mt_logo

నిఖ‌త్ జ‌రీన్‌, పీవీ సింధును ప్రశంసించిన మంత్రి కేటీఆర్

కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి ప‌త‌కం నెగ్గిన తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ అభినందించారు. మహిళల 50 కేజీల విభాగంలో నిఖత్‌ 5-0తో కార్లే మెక్‌ నాల్‌ (నార్త్‌ ఐర్లాండ్‌)పై విజయం సాధించింది. నిఖత్‌.. ఇటీవలే ప్రపంచ చాంపియన్‌గా అవతరించి, అదే జోరు బర్మింగ్‌హామ్‌లోనూ కొనసాగించింది. బౌట్‌ ఆరంభం నుంచే చెలరేగిపోయిన నిఖత్‌.. తొలి రౌండ్‌ ముగిసేలోగానే న్యాయ నిర్ణేతలు నిఖత్ దే విజయంగా నిర్ణయానికొచ్చారు. మిగిలిన రెండు రౌండ్‌లలోనూ నిఖత్ అదే జోష్‌ కొనసాగించింది. రిఫరీ నిఖత్‌ విజయాన్ని ఖరారు చేయగా.. ఆనందంలో ఒక్కసారిగా గాల్లోకి పంచ్‌లు విసిరిన తన విజయాన్ని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ నిఖత్ జరీన్ ధన్యవాదాలు తెలిపింది. కాగా టేబుల్ టెన్నీస్ మిక్సిడ్ జోడిలో స్వర్ణ పతకం నెగ్గిన శరత్ కమల్, శ్రీజ ఆకులను మంత్రి కేటీఆర్ అభినందించారు. అలాగే బ్యాట్మెంటిన్ సింగిల్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన హైదరాబాద్ షట్లర్ పీవీ సింధుకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *