mt_logo

ఇంటింటికే కాదు.. పొలాల వద్దకు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్

తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు ఇంటింటికి వెళ్లి టీకాలు వేస్తున్నారు. అంతే కాదు..పొలాల బాట కూడా ప‌ట్టారు. వ్య‌వ‌సాయ ప‌నులు చేసుకుంటూ బిజీగా ఉంటున్న రైతుల‌కు, కూలీల‌కు పొలాల వ‌ద్దే టీకాలు వేసి వంద శాతం వ్యాక్సినేష‌న్‌కు కృషి చేస్తున్నారు. ఇలా పొలాల వ‌ద్ద టీకాలు వేస్తున్న ఆరోగ్య కార్యకర్తలను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ త‌న ట్విట‌ర్లో అభినందించారు. ఒక‌టి ఖ‌మ్మం జిల్లాలో మ‌రొక‌టి రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో పొలాల వద్ద టీకాలు వేస్తున్న ఫోటోలు షేర్ చేస్తూ.. “ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల చిత్త‌శుద్ధికి, నిబ‌ద్ద‌త‌కు ఈ ఫోటోలే నిద‌ర్శ‌న‌మ‌ని, ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ విప్ల‌వం ప్రారంభ‌మైంద‌ని” కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *