mt_logo

సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అనుసరించే వ్యూహాలపై శుక్రవారం ఉదయం సీఎల్పీ భేటీ అయింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్య‌క్ష‌త‌న జరిగిన ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై పార్టీ ముఖ్య నేతల దగ్గర తన అసంతృప్తిని, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పార్టీ వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం.. సంగారెడ్డికి వస్తున్నట్టు పీసీసీ నుంచి కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. తన నియోజకవర్గానికి వస్తున్నపుడు సమాచారం ఇవ్వాలనే ప్రోటోకాల్ కూడా తెలియదా అని ప్రశ్నించారు. కావాలనే గజ్వేల్ సభలో తనను మాట్లాడనివ్వలేదన్నారు. తనకు రేవంత్ కి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేందుకే రేవంత్ రెడ్డి ఇలా ప్రవర్తిస్తున్నారని అని జగ్గారెడ్డి పార్టీ ముఖ్యనేతల దగ్గర వాపోయారు. పార్టీ కమిటీలలో డిస్కషన్ చేయకుండా ముందే ప్రోగ్రాంలు ఫిక్స్ చేస్తున్నారు, ఇది పార్టీనా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అందరూ ఒకటేనని, ఒక్కరే స్టార్ అనుకుంటే కుదరదని, ఒక్కడి ఇమేజ్ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాగా ​సమావేశం ముందు నుంచే జగ్గారెడ్డి ఆగ్రహంతో ఉన్నారని తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఆఖరి నిమిషంలో సీఎల్పీ భేటీకి దూరంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *