mt_logo

తెలంగాణ గ్రామాలను దేశంలోనే నం.1 గా నిలిపాము : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలోని గ్రామాలు, పల్లెలను దేశంలోనే నం.1 స్థానంలో నిలిపామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మనందరి బాగుకోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లెలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.33 లక్షలతో నిర్మించిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల మంజూరుకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారని అన్నారు. త్వరలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో తాగునీటి సౌకర్యంతోపాటు ట్రాక్టర్, ట్రాలీ, వైకుంఠ ధామం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, రోడ్లు, డ్రైనేజీలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. వెంకట్రావుపల్లెలో విరాసత్ సహా అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. గ్రామానికి సాగునీటి సౌకర్యం కల్పిస్తామని, సొంత జాగాలో ఇండ్ల నిర్మాణం చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *