రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మహేశ్వరం పరిధిలోని తుక్కుగూడలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడ కూరగాయలతో పాటు మాంసం విక్రయాలకు సంబంధించి మార్కెట్లో సదుపాయాలు కల్పించనున్నారు. సమీకృత మార్కెట్ నిర్మాణానికి 4 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయగా, 108 గదులతో వేర్వేరుగా వెజ్, నాన్ వెజ్ బ్లాక్లను నిర్మించనున్నారు. అలాగే తుక్కుగూడకు మంచినీటి పైప్లైన్ నిర్మాణానికి, జల్పల్లిలో రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… హైదరాబాద్ పక్కనే ఉన్న జల్పల్లికి గతంలో మంచినీటి కొరత ఉండేదని, ఇప్పుడు సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ బాధ లేదనడం సంతోషకరమన్నారు. ఇక్కడ మంచినీటి సరఫరా కోసం 72 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇక్కడ స్థానికంగా ప్రభుత్వ స్థలం లేనందున వక్ఫ్ బోర్డు జాగా నుండి మునిసిపల్ ఆఫీస్, మిగితా వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్రైనేజి, రోడ్ల కోసం నిధులు అడిగారని, త్వరలో వాటిని మంజూరు చేస్తామన్నారు. మామిడిపల్లి వద్ద నూతన రోడ్డుకు నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పట్టణంలో కనీస అవసరాలు తీరాలనే ఉద్దేశ్యంతో వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠదామాలు, లైట్స్, రోడ్స్ ఇతరత్రా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న కార్పొరేషన్లు, మునిసిపల్ లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరగా, వాటిని మంజూరు చేశామన్నారు. మన ఊరు మన బడి పేరుతో సర్కారు బడుల్లో మౌలికసదుపాయాలు ఏర్పరుస్తున్నామని వెల్లడించారు. శివారు ప్రాంతాల్లో గల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ఓ ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని చెప్పారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్