mt_logo

అత్యాధునిక సాంకేతికతో కూడిన దోబీ ఘాట్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాష్ట్రంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన దోబీ ఘాట్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. 2.10 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మెకానైజ్డ్ దోబీ ఘాట్ లో ఆధునిక యంత్రాలతో బట్టలు ఉతకడం, ఆరబెట్టడం, ఇస్త్రీ చేయడం వంటివన్నీ ఒకేచోట పూర్తి చేసేలా వసతి ఏర్పరిచారు. గంటకు 90 కిలోల బట్టలను ఉతికి, ఆరబెట్టే సామర్థ్యం ఉన్న యంత్రాలను ఇక్కడ అమర్చారు. ఈ విధానంతో నీరు ఆదా అవడంతోపాటు, రజకులకు చాలా శ్రమ తగ్గనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ అత్యాధునిక సాంకేతికతో కూడిన దోబీ ఘాట్ ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ ను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే తెలంగాణలోని అన్ని పట్టణాల్లో ఇలాంటి ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేసేలా చూస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *