కైతలపూర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

  • June 21, 2022 12:57 pm

హైదరాబాద్ లోని కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్‌లో ఫ్లై ఓవర్‌ను రూ.86 కోట్ల వ్యయంతో ఎస్.ఆర్.డి.పి. కింద జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్‌తో కూకట్‌పల్లి, హైటెక్ సిటీల మధ్య ప్రయాణం సులభం కానుంది. జేఎన్టీయూ జంక్షన్, మలేషియన్ టౌన్ షిప్ జంక్షన్, హైటెక్ సిటీ ఫ్లై ఓవర్, సైబర్ టవర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గనున్నాయి. సనత్‌నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కిలో మీటర్ల ప్రయాణ దూరభారం తగ్గనుంది.

 

 


Connect with us

Videos

MORE