హిమాలయ శిఖరాలపై తెరాస జెండాను రెపరెపలాడించాడు ఓ తెలంగాణ యువకుడు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన 17 ఏళ్ల వెంకటేశ్ సైకిల్‌పై కశ్మీర్ వరకు సాహసయాత్ర చేశాడు. లఢక్‌కు చేరుకొని అక్కడి లాపాస్ వద్ద టీఆర్‌ఎస్ పార్టీ గులాబీ జెండాను ఎగురవేశాడు. ఆదివారం కశ్మీర్‌లోని లఢక్-ఖర్దున్గ లాపాస్ వద్ద సీఎం కేసీఆర్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చిత్రాలతో కూడిన గులాబీజెండాను ప్రదర్శించిన వెంకటేశ్… ‘జై తెలంగాణ, జై టీఆర్‌ఎస్’ నినాదాలు చేసి, తెరాస శ్రేణుల్లో ఉత్సాహం నింపాడు. వెంకటేష్ గత నెలలో పటాన్‌చెరు నుంచి సైకిల్‌పై బయల్దేరి 26 రోజుల్లో 2,600 కిలోమీటర్లు ప్రయాణించి కాశ్మీర్ లోని లఢక్ చేరకొన్నాడు. అక్కడ సముద్ర మట్టానికి 18,380 అడుగుల ఎత్తులో టీఆర్‌ఎస్ జెండాను విజయగర్వంతో ప్రదర్శించాడు.