హైదరాబాద్ నగరంలో రెండవ అతి పొడవైన ఓవైసీ-మిథాని ప్లైఓవర్ మంగళవారం రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 80 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల పొడవుతో, మిథాని జంక్షన్ నుండి ఒవైసీ జంక్షన్ వరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతి తక్కువ కాలంలో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. ఫ్లైఓవర్ ప్రారంభంతో ఆరాంఘర్, చంద్రాయణగుట్ట నుంచి ఎల్బీనగర్ బైరమల్ గుడా కర్మాన్‌ఘాట్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతోపాటు, ఇంధన వ్యయం, కాలుష్యం తగ్గనుంది. హైదరాబాద్ ప్రజలకు ఈ ఫ్లైఓవర్ ను అంకితం ఇస్తునట్టు తెలిపిన మంత్రి కేటీఆర్.. నగరంలోని డిఆర్డిఓ విభాగంలో విధులు నిర్వర్తించిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గౌరవార్థం మిథాని-ఒవైసీ ఫ్లైఓవర్ కు ఏపీజే అబ్దుల్ కలాం అని పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొననున్నారు.
- NHRC takes cognizance of Lagacharla issue; seeks report from CS, DGP
- Pharma companies taking over fertile lands of tribals in Kodangal
- Congress govt. stops providing snacks to 10th students in special classes
- Congress govt. gears up to fleece citizens through LRS; aims to mint Rs. 10k cr
- Congress claims credit for ‘Kaloji Kalakshethram’ built by BRS govt.
- త్వరలో కుల గణన డెడికేటెడ్ కమీషన్‌కు తెలంగాణ జాగృతి నివేదిక
- అదానీ వ్యాపార విస్తరణ తెలంగాణలో జరుగుతుంటే కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియదా?: కేటీఆర్
- నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం రేవంత్‌కి అలవాటు: హరీష్ రావు
- మహాధర్నాకు అనుమతి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్‌కి చెంపపెట్టు: సత్యవతి రాథోడ్
- రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు: హరీష్ రావు
- అదానీ అంశంలో చేతులెత్తేసిన రాహుల్.. రేవంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?
- రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నాడు: హరీష్ రావు
- ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా?: ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై హరీష్ రావు
- మహారాష్ట్ర ఫలితాల తర్వాత రేవంత్ సీఎం పదవి ఊడటం ఖాయం: దాసోజు శ్రవణ్
- కేసీఆర్ రైతు సీఎం అయితే రేవంత్ రెడ్డి బూతు సీఎం: హరీష్ రావు