సాగరహారంలో మీ జాడెక్కడ ? ప్రతిపక్ష నేతలను నిలదీసిన మంత్రి కేటీఆర్

  • September 30, 2022 5:56 pm

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో చేప‌ట్టిన సాగ‌ర‌హారానికి నేటితో ప‌దేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్య‌మాన్ని కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌తాక స్థాయికి తీసుకెళ్లిన సంద‌ర్భం.. ల‌క్ష‌ల గొంతుక‌లు జై తెలంగాణ అని నిన‌దించిన రోజు అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌తి రోజు ప‌నికిమాలిన విమ‌ర్శ‌లు చేసే ప్ర‌తిప‌క్ష నేత‌లు రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్, ప్ర‌వీణ్ కుమార్‌, ష‌ర్మిలకు కేటీఆర్ సూటి ప్ర‌శ్న వేశారు. తెలంగాణ ఉద్య‌మంలో మీ జాడ ఎక్క‌డ అని కేటీఆర్ నిల‌దీశారు.


Connect with us

Videos

MORE