గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ యువ షూటర్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. బ్రెజిల్ వేదికగా జరుగుతోన్న డెఫ్లింపిక్స్‌లో తెలంగాణ యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ గోల్డ్ మెడల్‌తో మెరిశాడు. ఈ సందర్భంగా ధనుష్ శ్రీకాంత్‌తో పాటు గగన్ నారంగ్‌కు మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపారు. భారత్ తరపున డెప్లింపిక్స్‌లో పాల్గొన్న ధనుష్ శ్రీకాంత్.. పురుషల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఫైనల్లో 247.5 పాయింట్లు సాధించిన ధనుష్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.