షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలో ప్రొక్టర్ అండ్ గాంబిల్ లిక్విడ్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో పాటు పీ అండ్ జీ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 200 కోట్ల పైచిలుకు రూపాయాలతో ఈ కంపెనీని ప్రారంభం చేసుకున్నామని తెలిపారు. ఫ్యూచర్ అంతా లిక్విడ్ డిటర్జెంట్స్ అని పీ అండ్ జీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కేటీఆర్ తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో పీ అండ్ జీ శిక్షా ద్వారా తెలంగాణలోని అన్ని వర్గాలకు మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. లింగ సమానత్వం కోసం పీ అండ్ జీ చేస్తున్న కృషి ఎంతో ఆకట్టుకుందన్నారు. 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ఆరేండ్ల కాలంలో రాష్ట్రంలో పీ అండ్ జీ తన కార్యకలాపాలను విస్తరించిందని తెలిపారు. తెలంగాణకు నిరంతరం మద్దతు తెలుపాలని కోరుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు.
- Migration of BJP leaders into BRS continues
- Telangana Digital Media Wing Director Dileep Konatham bags ‘Social Media Person of the Year’ award
- Tamil Nadu requests 7 lakh tonnes boiled rice from Telangana
- KTR’s effort pays off; Telangana man languishing in Dubai jail to be freed
- Distribution of double bedroom houses is done in a very transparent manner: KTR
- బీఆర్ఎస్ పోరుతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం.. ఇక ఓబీసీ బిల్లుకోసం గులాబీ పార్టీ ఉద్యమం!
- బండికి మించి నియంతృత్వం.. కిషన్‌రెడ్డి తీరుతో బీజేపీలో అసంతృప్తి జ్వాల!
- ఎక్కువ అభివృద్ధి చేసి తక్కువ చెబుతున్నాం: మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
- ఓబీసీ మహిళలను విస్మరించడం సరికాదు : రష్యా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కవిత
- సీఎం కేసీఆర్‌ను కొనియాడిన శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన
- ఇది కేసీఆర్ విజన్.. లోటువర్షపాతం ఉన్నా చెరువుల్లో నిండా నీళ్లు.. రిజర్వాయర్లలో నీళ్లు ఫుళ్లు!
- తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంకు ‘సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సంతాపం
- సీఎం కేసీఆర్ సంకల్పం.. దేశానికే బువ్వగిన్నెలా రాష్ట్రం.. తెలంగాణ బియ్యం కోసం పక్క రాష్ట్రాల క్యూ!