mt_logo

తెలంగాణ నుండి మరో కోవిడ్ వాక్సిన్ విడుదలపై మంత్రి కేటీఆర్ హర్షం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మ‌రో కొవిడ్ టీకా తెలంగాణ రాష్ట్రం నుండి మార్కెట్లోకి రావ‌డంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు. భార‌త్ బ‌యోటెక్ కొవాగ్జిన్ టీకాను విడుద‌ల చేయ‌గా, తాజాగా తెలంగాణ‌కు చెందిన ‘బయలాజికల్‌ ఈ’ కంపెనీ ‘కార్బివాక్స్’ అనే కొవిడ్ టీకాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నుంది. ఈ సంద‌ర్భంగా ‘బయలాజికల్ ఈ’ కంపెనీ సీఈవో మ‌హిమ దాట్ల‌, ఆమె బృందానికి కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. ఈ కంపెనీ 2022, ఫిబ్ర‌వ‌రి నుంచి నెల‌కు 100 మిలియ‌న్ల డోసుల‌ను ఉత్ప‌త్తి చేసేందుకు ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. కాగా హైదరాబాద్‌కు చెందిన ‘బయలాజికల్‌ ఈ’ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్‌ టీకా ‘కార్బివాక్స్‌’కు అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో)కు చెందిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ అనుమతులనిచ్చినట్టు డీసీజీఐ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *