వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ రోడ్డెక్కిన బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యార్థులు లేవనెత్తిన అంశాలను సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారని తేజాగౌడ్ అనే విద్యార్థి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేయగా… దీనిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

