రాష్ట్రానికి చెందిన సివిల్స్ విజేతను అభినందించారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. సివిల్స్‌లో ఆల్ ఇండియా 83వ ర్యాంకు సాధించిన టీఎస్‌ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కే రాములు కూతురు కావలి మేఘనను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసిస్తూ.. ‘కష్టపడి లక్ష్యంకోసం పనిచేసే వారికి మేఘన స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మేఘనను సత్కరించారు. మేఘన శుక్రవారం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పీ రోహిత్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.