తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గంగపుత్రుల జీవితాలు మారిపోయాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపలు కావాలంటే ఆంధ్ర ప్రాంతం నుండి తెచ్చుకునే వాళ్లమని, ఇప్పుడు రాష్ట్రానికి సరిపడా చేపలను ఇక్కడే పెంచుకుంటూ… విదేశాలకు కూడా అందించే స్థాయికి తెలంగాణ గంగపుత్రులు ఎదిగారని మంత్రి హరీష్ రావు కొనియాడారు. సిద్దిపేటలోని కోమటి చెరువులో మంత్రి హరీశ్ రావు చేపపిల్లలను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లతో రాష్ట్రంలో చెరువులు కళకళ లాడుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 120 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్నామని తెలిపారు. సిద్దిపేట నియోజక వర్గంలోని అన్నిచెరువుల్లో చేపలు విడుదల చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.