mt_logo

లండన్ లో మెగా బతుకమ్మ సంబురాలు

లండన్ లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో లండన్ మెగా బతుకమ్మను ఘనం గ నిర్వహించారు. యూరోప్ లోనే అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించారు. దాదాపు 2500 మంది బతుకమ్మ ఆటలో పాల్గొని విజయవంతం చేశారు. మొదట అమ్మవారి పూజ, షమీ పూజ నిర్వహించి, బతుకమ్మ ఆట, కోలాటం ఆడారు.

సాంప్రదాయక బతుకమ్మ ఆటను ప్రోత్సహించి నూతన పోకడలకు, డీజెల జోలికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో సాంప్రదాయ బద్దంగ బతుకమ్మను నిర్వహించారు.

ముఖ్య అతిధిగ విచ్చేసిన లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు కాపాడలిసిన బాధ్యత ఎన్నారైల పైన ఉందని, 6 ఏండ్లుగ బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అంతటి మాట్లాడుతూ యూరోప్ లోనే అతి పెద్ద బతుకమ్మ నిర్వహణ బాధ్యతకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ 2010 లో నిర్వహణ ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఆర్థిక వనరులు ఎలా సమకూర్చాలో తెలియని సమయంలో యూరోప్ లోనే మొట్టమొదటి బతుకమ్మకు పునాదులు వేసి నిర్వహించిన తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వ్యవస్థాపకుడు గంప వేణుగోపాల్ ను అభినందిస్తూ 2012 లో బ్రిటన్ లో వివిధ ప్రాంతాల్లో ఊరూరా బతుకమ్మ నిర్వహించి బతుకమ్మ భావజాలాన్ని చాటుతూ ప్రతి తెలంగాణ బిడ్డ బతుకమ్మ ఆట లో పాల్గొనే స్థాయికి చేరుకుందని అన్నారు.

ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ గత ఏడాది అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి మళ్లీ ఈ యేడు తిరగరాసి అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించిన ఘనత మహిళలదేనని అన్నారు.

మహిళా విభాగం మీనా అంతరి, వాణి అనసూరి, శౌరి గౌడ్, సాయి లక్ష్మి, మంజుల పిట్ల, జయశ్రీ, శ్రీవాణి మార్గ్, సవిత జమ్మల, దివ్యా, అమృత, సీతాలత, నీరజ, వీణ మ్యాన, కారుణ్య, ఉష రమాలు బతుకమ్మ నిర్వహణలో కీలకంగా పని చేసి విజయవంతం చేశారు.

వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, కోర్ సభ్యులు రంగు వెంకట్, ప్రవీణ్ రెడ్డి, నరేష్ మల్యాల, కార్యదర్శి పిట్ల భాస్కర్, అడ్వైసరి సభ్యులు డా. శ్రీనివాస్, మహేష్ జమ్ముల, వెంకట్ స్వామి, బాలకృష్ణ రెడ్డి, మహేష్ చాట్ల, శేషు అల్లా, వర్మా, స్వామి ఆశా, అశోక్ మేడిశెట్టి, సాయి మార్గ్, వాసిరెడ్డి సతీష్ రాజు కొయ్యడలు విజయవంతంలో బాగస్వామ్యులయ్యారు.

మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బతుకమ్మ ఆట అనంతరం నిమజ్జనం చేసిన తర్వాత అందరికి విందు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *