mt_logo

మేడ్ ఇన్ తెలంగాణ వస్తువులు ఇక నేరుగా ఆన్లైన్లో లభ్యం

రాష్ట్ర ప్రభుత్వం మేడ్‌ ఇన్‌ తెలంగాణ ఆన్‌లైన్‌ విక్రయాలను అందుబాటులోకి తెచ్చింది. స్థానికంగా తయారైన వస్తువులను ఎటువంటి కమీషన్‌ లేకుండా విక్రయించేందుకు https:// madeintelangana.linker.store/ వెబ్‌సైట్‌ను గత నవంబర్ లోనే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తరహాలోనే వివిధ రకాల వస్తువులను ఇక్కడ విక్రయానికి ఉంచారు. ప్రస్తుతం ప్రయోగాత్మక విక్రయాలు మొదలైనప్పటికీ.. జనవరి నుంచి పూర్తిస్థాయిలో అమ్మకాలు జరగనున్నాయి.

స్టార్టప్స్‌తోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ), ఇతర వ్యక్తిగత చిరు వ్యాపారులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ లింకర్‌ అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ సహకారంతో ఈ ఆన్‌లైన్‌ మాల్‌ను ఏర్పాటుచేసింది. ప్రస్తుతానికి పోచంపల్లి చీరలు, వరంగల్ తివాచీలు, నిర్మల్ కొయ్యబొమ్మలు వంటి వివిధ రకాల హస్తకళలతోపాటు రాష్ట్రంలోని పరిశ్రమల్లో తయారవుతున్న సుమారు 120 రకాల వస్తువులను అమ్మకానికి ఉంచారు. విక్రయదారులు, కొనుగోలుదారులు ఎటువంటి రిజిస్ట్రేషన్‌ ఫీజు లేకుండా తమ లావాదేవీలు చేసుకొనే వీలు కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *