గత కొద్దిరోజులుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంపై కేంద్ర మంత్రులను నిలదీస్తున్న రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్ల మూసివేతపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు దీటైన జవాబిచ్చారు. కంటోన్మెంట్ పరిధిలో మొత్తం 27 రోడ్లు ఉండగా.. వాటిలో కేవలం 7 రోడ్లపై మాత్రమే ప్రజల రాకపోకలకు అనుమతిచ్చారని ట్వీట్ చేశారు. ఇంకా 20 రోడ్లు మూసి ఉన్నాయని, లక్షల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్లను వెంటనే తెరిపించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన మ్యాప్‌తోపాటు అక్కడ మూసేసిన, తెరిచిన రోడ్ల వివరాలను మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో పొందుపరిచారు.
కంటోన్మెంట్ పరిధిలో మూసేసిన రోడ్లు ఇవే..
అమెస్ట్ రోడ్డు (జనరల్ కృష్ణారావు రోడ్డు), (హకీంపేట-రాష్ట్రపతి నిలయం), కంటోన్మెంట్ గార్డెన్-రాజేంద్రసింగ్‌జీ రోడ్డు, హోలీ ట్రినిటీ రోడ్డు, బర్ రోడ్డు, లేక్‌లైన్ రోడ్డు (బెప్టా గోల్ఫ్ కోర్సు-హనుమాన్ టెంపుల్ జంక్షన్) రిచర్డ్‌సన్ రోడ్డు (లక్డావాలా జంక్షన్-బెప్టా క్లబ్‌హౌస్), యాప్రాల్ రోడ్డు (పిరుసింగ్ మార్గ్), బాయంరోడ్డు (సన్‌డయల్‌సర్కిల్- ఈగల్ చౌక్), ప్రోట్‌నీ రోడ్డు (ఫ్లాగ్స్ స్టాప్‌హౌస్-బట్టికలోవా క్యాంటీన్), అమ్ముగూడ రోడ్డు (బట్టికలోవా క్యాంటీన్), టాసా సర్కిల్-రాజీవ్ రహదారి/ఔరంగాబాద్ రైల్వేలైన్ రోడ్డు, రాజేంద్రసింగ్‌జీ రోడ్డు (బైసన్ ద్వార్-హోలీ ట్రినిటీ చర్చి), బాలక్లావా రోడ్డు-అమ్ముగూడ రోడ్డు, లింక్‌ఫ్యాకల్టీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ (ఎఫ్‌ఈఎల్), సర్కిల్-రాజీవ్ రహదారి రోడ్డు, ఆర్‌ఎ లైన్స్ రోడ్డు-వెస్లీ చర్చి రోడ్డు, ఇంప్రెస్ రోడ్డు (ఆల్ సెయింట్స్ రోడ్డు-వెస్లీ చర్చి), ఆర్‌ఎ లైన్స్ రోడ్డు,సర్వీస్ రోడ్డు, అండర్ ఆర్కేపురం ఫ్లైఓవర్ (కంటోన్మెట్ కానప్పటికీ మూసివేసారు.), మార్నింగ్‌టన్ రోడ్డు (ఆర్టీఏ ఆఫీస్ తిరుమలగిరి-ఏవోసీ రికార్డ్స్ ఆఫీస్),
ఏవోసీ రికార్డ్స్ ఆఫీస్- ఆర్డినెస్స్ రోడ్డు, తెరిచిన రోడ్లు.
ప్రస్తుతం తెరిచి ఉన్న రోడ్లు :
ఫ్యాకల్టీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ (ఎఫ్‌ఈఎల్), సర్కిల్-లాల్‌బజార్ రోడ్డు, రాబర్ట్ రోడ్డు, శివాలయం రోడ్డు, గఫ్ రోడ్డు, వెల్లింగ్‌టన్ రోడ్డు, ఆర్డినెస్స్ రోడ్డు, ఎంట్రెంచ్‌మెంట్ రోడ్డు.