mt_logo

అమెజాన్, ఆపిల్ కు ఆయువు పట్టు తెలంగాణ : మంత్రి కేటీఆర్

సోమవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రం సాధించిన పురోగతిని సమగ్రంగా వివరించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధిలో ముందంజలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహాయం అందించకపోగా, మోకాలడ్డుతోందని విమర్శించారు. “మన నినాదం స్టార్టప్స్‌ అయితే, కేంద్రం నినాదం ప్యాకప్‌, మనం కొత్త పరిశ్రమలు ప్రారంభిస్తే, కేంద్రం ఉన్న పరిశ్రమల ఉసురు తీస్తుంది” అన్నారు అయినప్పటికీ తెలంగాణ.. “ఎర్రబస్సు నుంచి ఎలక్ట్రిక్‌ బస్సు దాకా.., ఎలక్ట్రిక్‌ బస్సు నుంచి ఎయిర్‌ బస్సు దాకా.., ట్రాక్టర్‌ నుంచి హెలికాప్టర్‌ దాకా.., టైల్స్‌ నుంచి టెక్స్‌టైల్స్‌ దాకా.., యాప్స్‌ నుంచి గూగుల్‌ మ్యాప్స్‌ దాకా..ఇలా ప్రతీ ఒక్కదానికి గమ్యస్థానం తెలంగాణ రాష్ట్రం” అని పేర్కొన్నారు. “గూగుల్‌కు గుండెకాయ హైదరాబాద్‌.., అమెజాన్‌, యాపిల్‌కు ఆయువు పట్టు హైదరాబాద్‌.., ఫేస్‌బుక్‌కు ఫస్ట్‌ అండ్‌ ఫేవరెట్‌ డెస్టినేషన్‌ హైదరాబాద్‌.., ఐటీ అంటే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కాదు.. ఇన్‌క్రెడిబుల్‌ తెలంగాణ..అని కొత్త భాష్యం చెప్పారు. దీన్ని చేరుకునేందుకు కేసీఆర్‌ నాయకత్వంలో మనమందరం బృహత్తరమైన ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *