mt_logo

ఇదెక్కడి అరాచకం.. ఏకంగా తెలంగాణ గొంతు కేసీఆర్ పైనే నిషేధమా: కేటీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను రెండు రోజుల పాటు ప్రచారం చేయొద్దని నిషేధిస్తూ ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఆదేశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇదెక్కడి అరాచకం.. ఏకంగా తెలంగాణ గొంతు కేసీఆర్ పైనే నిషేధమా? మోడీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా.. రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా అని ధ్వజమెత్తారు.

బడే భాయ్..చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది అని ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్రకి వస్తున్న స్పందనకు చూసి భయపడే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలకు మోడీ – రేవంత్‌ల అహంకారానికి.. అధికార దుర్వినియోగానికి సరైన సమాధానం చెబుతారని కేటీఆర్ అన్నారు.