mt_logo

క్రిషాంక్ అరెస్టు అక్రమం, అన్యాయం, దుర్మార్గం: కేటీఆర్

బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. క్రిషాంక్ అరెస్టు అక్రమం.. అన్యాయం.. దుర్మార్గమని పేర్కొన్నారు. క్రిషాంక్ అంటే.. ఒక ఉద్యమ గొంతుక, ఒక చైతన్య ప్రతీక, యువతరానికి ప్రతిబింబం అని అన్నారు.

గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలపై.. ఢిల్లీ బీజేపీ అరాచకాలపై.. గళమెత్తినందుకే ఈ దౌర్జన్యం.. ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గం అని తెలిపారు. కాంగ్రెస్- బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు.. మూల్యం చెల్లించక తప్పదు.. ఈ నియంతృత్వ.. నిర్బంధాలకు..
తెలంగాణ ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు అని హెచ్చరించారు.

నాడు ఎమర్జెన్సీ చూశాం.. నేడు అప్రకటిత ఎమర్జెన్సీ చూస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాలరాసినందుకు ఆనాడు పాలక పక్షానికి పట్టిన గతే
రేపు కాంగ్రెస్-బీజేపీలకు పట్టడం ఖాయం.. తథ్యం అని కేటీఆర్ అన్నారు. పార్టీ లీగల్ సెల్ కేసుని పర్యవేక్షిస్తుంది అని తెలిపారు.