mt_logo

కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్రముఖ ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో మొదటి వరుసలో నిలిచే ఐఐటీ మద్రాస్ కేటీఆర్‌ను తమ విద్య సంస్థలో జరిగే అంట్రపెన్యురల్ సమిట్ అనే ప్రముఖ కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించింది.

ప్రతి ఏటా ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ (E-Summit) ఈ- సమ్మిట్ లో కీలకోపన్యాసం చేయాలని కోరింది. ఐఐటి మద్రాస్‌లో ప్రతి ఏటా నిర్వహించే ఈ- సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి అంట్రపెన్యురల్ రంగంలో కీలకమైన వ్యక్తులను, సంస్థల అధిపతులను, పాలసీ మేకర్లను, ప్రముఖ వ్యక్తులను ఆహ్వానిస్తుంది.

కేటీఆర్‌కున్న అపారమైన అనుభవాన్ని పురస్కరించుకొని, భవిష్యత్తు అంట్రపెన్యురల్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో ఐఐటీ మద్రాస్ కోరింది. ఐఐటీ మద్రాస్ విద్యార్థులు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేశంలోనే అంతర్జాతీయ గుర్తింపు ఐఎస్ఓ సర్టిఫికేషన్ కలిగిన ఏకైక కార్యక్రమంలో నిలిచింది.

రేపు, ఎల్లుండి జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో విజ్ఞప్తి చేశారు. ఈసారి ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్, హెచ్సీఎల్ సహ వ్యవస్థాపకులు అజయ్ చౌదరి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నట్లు ఐఐటీ మద్రాస్ తెలిపింది.