mt_logo

సత్తుపల్లిలో మిన్నంటిన కేసీఆర్ ‘మహిళాబంధు’ సంబురాలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం కేసీఆర్ ‘మహిళాబంధు’ కార్యక్రమాలు అంబరాన్నంటాయి. మహిళల సాధికారత కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, మిషన్ భగీరథ వంటి అనేక పథకాలను కీర్తిస్తూ… ముఖ్యమంత్రి కేసీఆర్ జై హో అంటూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. సత్తుపల్లిలో మున్సిపల్ కార్యాలయం వద్ద అర్హులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, చీరలను పంపిణీ చేసి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ‘మహిళాబంధు’ సంబరాలు నిర్వహించాలని అని తెరాస పార్టీ అధ్యక్షులు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో 130 అడుగుల అవరణలో రంగవల్లులతో మహిళల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రతిబింబిస్తూ కులాలకు, మతాలకు అతీతంగా అందిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ పథకాలను తెలిపే విధంగా హిందూ,ముస్లిం, క్రైస్తవ మత వివాహ సాంప్రదాయాలతో చిత్రాలను గీసి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వదిస్తున్నట్లు ముగ్గులతో తీర్చిదిద్దారు. కళ్యాణ లక్ష్మికి 10 లక్షల 50 వేల చెక్కులు అంటూ తలంబ్రాలతో గీశారు. అదే విధంగా 11 లక్షల తల్లులకు కేసీఆర్ కిట్లు అంటూ రంగవల్లులను అలంకరించారు. ఈ రంగవల్లులు చుట్టూ మహిళలు కెసిఆర్ జై హో, థాంక్యూ కేసీఆర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ రంగవల్లుల సంబురాల ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *