mt_logo

ఢిల్లీలో ఎగిరిన గులాబీ జెండా… అట్టహాసంగా బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభం 

దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభించి, కుర్చీలో ఆసీనుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్, జేడీఎస్ అధినేత‌, క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్‌ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకుల‌తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.

పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం కంటే ముందు.. రాజ‌శ్యామ‌ల యాగం పూర్ణాహుతికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తుల‌కు వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *