mt_logo

రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నుండి కాలచక్రం తిరిగి మొదలౌతుందని, చెట్లు చిగురిస్తూ ప్రకృతిలో నూతనోత్తేజం నెలకొంటుందన్నారు. 

వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాదినుండే ప్రారంభిస్తారని అందువల్ల ఉగాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా పిలుచుకోవడం ప్రత్యేకతన్నారు.

ప్రజల జీవితాల్లో వసంతాన్ని నింపి, శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేలా దీవించాలని ప్రకృతిమాతను కేసీఆర్ ప్రార్థించారు.