మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలో జరిగిన నియోజకవర్గ స్థాయి యువత సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి.. రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడా? ఒక్క పరీక్ష నిర్వహించారా.. మా హయాంలో ఉద్యోగాలు వస్తే మీరు ఇచ్చినట్టు చెప్పుకుంటారా అని ప్రశ్నించారు.
దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్‌లో చెల్లుతుందా..తెలంగాణ ఒద్దు అంటూ గన్ను ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్.. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం బాధాకరం అని పేర్కొన్నారు.
సిద్దిపేట వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు ఎత్తుకెళ్లారు.. రూ. 150 కోట్ల నిధులు రద్దు చేశారు. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీలకు బుద్ది చెప్పాలి. 18 గంటలు మీకోసం పనిచేశా.. మీ కుటుంబ సభ్యుడిగా పనిచేశా.. కొన ఊపిరి ఉన్నంత వరకు మీకోసం పనిచేస్తా. సిద్దిపేట అభివృద్ధి శ్వాసగా పనిచేస్తా అని పునరుద్ద్ఘాటించారు.
నేటి యువతే భవిష్యత్ వారసులు.. కాబోయే ప్రజాప్రతినిధులు, అధికారులు మీరే కావాలి..మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం. సోషల్ మీడియాలో కొత్త పుంతలు తొక్కేలా పనిచేయండి అని పిలుపునిచ్చారు.
అవార్డుల ఖిల్లా సిద్దిపేట నెంబర్ 1.. స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుందాం. కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఒచ్చేదా.. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారు..ఎంతో మంది త్యాగాల ఫలం తెలంగాణ రాష్ట్ర సాకారం.. రేవంత్ అమరవీరులకు నివాళి అర్పించారా అని హరీష్ అడిగారు.