ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవిత

  • November 24, 2021 4:41 pm

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఇంటివద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. అయితె ఈ స్థానం నుండి ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ పోటీకి దూరంగా ఉండగా.. స్వతంత్ర అభ్యర్థి అయిన కోటగిరి శ్రీనివాస్ పై ఫోర్జరీ ఆరోపణలు రావడంతో నామినేషన్ తిరస్కరించబడింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక ఏకగ్రీవమైంది.


Connect with us

Videos

MORE